

హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయాల్లో నూతనంగా నిర్మించిన స్వరంగ మార్గం గురించి తెలుసుకుందాం.


ప్రపంచంలో అత్యంత పొడవైన స్వరంగ మార్గం ఇదే. సముద్ర మట్టానికి 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దీనిని నిర్మించారు.
లడక్ చేరుకోవడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి లేహ్ – మనాలి రోడ్, మరొకటి రోహ్తాంగ్ పాస్ మార్గం. అయితే ప్రతి ఏటా రోహ్తాంగ్ పాస్ వద్ద దాదాపు ఐదు నెలలు విపరీతమైన మంచు కురుస్తుంది. దీని కారణంగా ఆ మార్గాన్ని మూసివేయాల్సి వస్తుంది.
ఈ సమస్యను అధిగమించేందుకు లేహ్ – మనాలి ని కలుపుతూ భారత ప్రభుత్వం భారీ స్వరంగ మార్గన్ని రూపకల్పన చేసింది.
ఈ స్వరంగాని మొదట్లో రోహ్తాంగ్ స్వరంగం అని పిలిచేవారు 2019 లో “అటల్ బిహారి వాజపేయి” పేరున మోదీ ప్రభుత్వం ‘అటల్ టన్నెల్‘ అని నామకరణం చేసారు.




అటల్ టన్నెల్ వింతలు :
మనాలి- లతంగ్ – స్పితి వ్యాలీ కలుపుకుంటూ వెళ్లే ఏ స్వరంగం 9.02 కిమీ పొడవు. ఈ స్వరంగం మనాలి- లేహ్ మార్గాన్ని 46కిమీ తాగిస్తుంది.
ఈ అటల్ టన్నెల్ వచ్చే దారి, పోయ్యే దారులతో రెండు మార్గాలు కలిగి ఉంటుంది. వెడల్పు 8మీ , ఎత్తు 5. 52 మీ.
ఈ స్వరంగం నిర్మాణానికి దాదాపు 3,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసారు.
ఈ స్వరంగం నిర్మించడానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ చాలా కష్టపడాల్సి వచ్చింది.
టన్నెల్ భద్రత :
ఈ స్వరంగంలో ప్రతి 150 మీ లకు ఫోన్ సదుపాయం కల్పించారు .
ప్రతి 60 మీ అగ్నిమాపక భద్రత , ప్రతి 500మీ లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లను ఏర్పాటు చేసారు.
ఈ స్వరంగం లో ప్రతి 2.2 కిమీ లకు ఒక మలుపు వస్తుంది. ప్రతి 1 కిమీ కు గాలి నాణ్యతను కొలిచే సూచికలను అమర్చారు.
ఈ స్వరంగంలో ప్రమాదం జరిగితే వెంటనే తెలుసుకోవడానికి ప్రతి 250మీ లకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసారు.
*ఈ కధనం బీబీసీ నుండి ప్రేరణ పొంది రాసినది.
Tags: ప్రపంచంలోనే అత్యంత ఎత్తలో నిర్మించిన పొడవైన స్వరంగ మార్గం world’s longest highway tunnel, atal tunnel,